ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం ఎదుగూ, బొదుగూ లేకుండా ఆరంభమయ్యాయి. తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 15 పాయింట్ల స్వల్ప లాభంతో 37541 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు క్షీణించి 11118 వద్ద దాఖలైంది. కీలక సూచీలు రెండూ ఊగిసలాట మధ్య కొనసాగుతాయని నిపుణుల మదింపు. మందుల తయారీ, మోటారు వాహనాల రంగాలు తప్ప మిగిలిన అన్ని రంగాలు స్తబ్దుగా ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, హెచ్యూఎల్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ , ఎన్టీపీసీ, మారుతి లాభపడ్డాయి. త్రైమాసిక ఫలితాల అంచనాలు చాలా నిరాశా జనకంగా ఉండటంతో టైటన్ బాగా నష్టపోతోంది. యస్ బ్యాంకు షేరు మరో 8 శాతం కూలింది. హెచ్సీఎల్, టీసీఎస్, యూపిఎల్, గ్రాసిం,యాక్సిస్, సన్ ఫార్మ, ఓఎన్జీసీ నష్ట, పోయాయి. డాలరు మారకంలో దేశీయ కరెన్సీ బలహీనమైంది. 16 పైసల నష్టంతో ట్రేడింగ్ను ఆరంభించింది. సోమవారం 71.02 కాగా బుధవారం రూ.71.18 దాఖలైంది.