అనకాపల్లి : రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలో కొండ శిఖర గ్రామాలైన పివిటిజి కొందు గిరిజన గ్రామాలు పిత్రి గడ్డ. నీళ్లు బంద. పెద్దగరువు. లోసింగి. కొత్త లో సింగి . తో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా మూలపేట పంచాయతీ జాజుల బంద గ్రామం పివిటిజి గ్రామాల్లో 680 జనాభా నివసిస్తూ ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ చెందిన జాజుల బంద గ్రామానికి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం కోసం 1 ఆర్ల నుండి పిత్రి గడ్డ.జాజుల బంద గ్రామాలకి మూడు గ్రామాలకు గిరిజనులు ఇంటికి 3000 రూపాయలు చందాలు వేసుకొని 6 లక్షల రూపాయలతో ప్రొక్లయిన్ ద్వారా రోడ్డుని ఫార్మేషన్ చేశారు. వర్షానికి కొట్టుకుపోయింది ఐటిడిఎ ద్వారా పాడేరు 2023 -24 సంవత్సరంలో ఎన్‌ఆర్‌జిఎస్ కోటి రూపాయలు మెటల్ రోడ్డు నిర్మాణానికి నీళ్లు మంజూరు చేశారు. 2024 సంవత్సరంలో జూలై నెలలో నాలుగు కలవట్లు కట్టి 29 లక్షల రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యి నిధులు స్వాహా చేశారు. కిల్లో దేవి (22) ఇంటి దగ్గర డెలివరీ అయింది. ఆరు కిలోమీటర్లు బాలింతని పాపని డోలీలో మోసుకొని వచ్చిన వార్తకు జాతీయ. స్థానిక మీడియాలో ప్రచురించడంతో పల్లె పండగ పేరుమీద డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ వారు ఉపాధి హామీ పథకం మెటీరియల్ గ్రాంట్ కింద 4 కోట్ల పది లక్షల రూపాయలు బిటి రోడ్డుకి నిధులు మంజూరు చేశారు. జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో ఫార్మేషన్ చేశారు. కల్వట్లు. సైడ్ కాలువలు సక్రమంగా తీయడంతో. భారీ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి. బిల్లులు చెల్లించలేదని, మధ్యలోనే రోడ్డు పనులు కాంట్రాక్టు నిర్మించారు.