ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టం..

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోరులో దిగిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రిటర్న్‌ గిఫ్ట్‌ తప్పకుండా ఇస్తామంటూ తెరాస అధినేత కేసీఆర్‌ పలుసార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కల్పించుకోవాలనే ఉద్దేశం తెరాసకు లేదంటూ స్పష్టం చేయడంతో ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం విస్తుపోయారు.ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలను తెదేపా,కేసీఆర్‌ల మధ్య పోటీగా చిత్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారన్నారని అందుకే ఎన్నికల్లో వేలుపెట్టడం లేదన్నారు.అయితే చంద్రబాబు నికలడ లేని మనిషని సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని,ప్రజలను సర్వనాశనం చేయడానికి కూడా చంద్రబాబు వెనుకాడడన్నారు. చంద్రబాబుకు దీర్ఘకాలిక శెలవులు ఇవ్వడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిశ్చయించుకున్నారని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పటికే స్పష్టమైందన్నారు.ఎన్నికల్లో తెలివైన నిర్ణయం తీసుకోవాలంటూ తెరాస అధినేత కేసీఆర్‌ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సూచించనున్నారన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos