హొసూరు : స్థానిక ప్రభుత్వాస్పత్రిలో తగినంత సంఖ్యలో వైద్యులు లేని కారణంగా రోగులు నానా అవస్థలు పడుతున్నారు. హొసూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉన్న వందల గ్రామాలకు ఈ ఆస్పత్రే దిక్కు. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా పిల్లలతో పాటు వృద్ధులు రోగాల బారిన పడుతున్నారు. పిల్లల వైద్య నిపుణులు లేకపోవడంతో అందుబాటులో ఉన్న అరకొర డాక్టర్లతోనే సర్దుకోవాల్సి వస్తోంది. దీని వల్ల గంటల తరబడి రోగులు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో మంగళవారం వృద్ధులు, పసికందుల వెతలు వర్ణనాతీతం.