ఉస్మానియా మినహా జూడాల సమ్మెకు తాత్కాలిక్ బ్రేక్

ఉస్మానియా మినహా జూడాల సమ్మెకు తాత్కాలిక్ బ్రేక్

హైదరాబాదు: తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్న జూడాల సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. డీఎంఈ, ఆరోగ్యశాఖ అధికారులతో అర్ధరాత్రి వరకు జరిపిన చర్చలు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో సమ్మెకు విరామం ప్రకటించారు. అయితే ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవన ఏర్పాటుపై మాత్రం ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అక్కడ సమ్మె కొనసాగిస్తున్నట్లు చెప్పారు.మరోవైపు అర్ధరాత్రి వరకు జరిపిన చర్చల్లో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం హామీ ఇచ్చింది. వసతి భవనాలకు నిధులు విడుదల చేస్తామని పేర్కొంది. కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధుల మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చింది. నేడు రెండు జీవోలు విడుదల చేస్తామని జూడాలకు హామీ ఇచ్చింది.ప్రభుత్వ హామీ నేతపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా నిపివేస్తున్నట్లు జూడాలు తెలిపారు. జీవోలు విడుదల కాకపోతే రేపు తిరిగి సమ్మె ప్రారంభిస్తామని హెచ్చరించారు. మరోవైపు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేడు జిల్లాల్లోని జూడాలతో చర్చలు జరపనున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా స్టైపెండ్ చెల్లింపు సహా ఎనిమిది ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు ఇటీవల సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos