ప్లాస్టిక్ వద్దు…పేపర్ ముద్దు

ప్లాస్టిక్ వద్దు…పేపర్ ముద్దు

హొసూరు : ప్లాస్టిక్‌తో తయారు చేసిన వస్తువులను బహిష్కరించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కృష్ణగిరి జిల్లా కలెక్టర్ ప్రభాకరన్‌ పిలుపునిచ్చారు. హొసూరులో అతి పురాతన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన మరకత సమేత శ్రీ చంద్ర చూడేశ్వర స్వామి రథోత్సవంలో సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం రథోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ ఉత్పత్తులను వాడుతున్నారా, లేదా అని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దుకాణదారులతో మాట్లాడుతూ ప్లాస్టిక్‌తో తయారు చేసిన క్యారీ బ్యాగ్ తదితర వస్తువులను వాడరాదని కోరారు. పేపర్‌తో తయారు చేసిన బ్యాగులను వాడాలని సూచించారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేశారు. హొసూరు తేరుపేటలోని ప్రతి దుకాణం వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వస్తువులు వాడవద్దని పదే పదే సూచించారు. పేపర్‌తో తయారు చేసిన బ్యాగులను పంపిణీ చేయడం ద్వారా జిల్లా కలెక్టర్ దుకాణదారులకు అవగాహన కల్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos