న్యూ ఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళ వారం ఏర్పాటు చేసిన విందును కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ అగ్రనేత సోనియాగాంధీని విందుకు ఆహ్వానించక పోవటం దీనిక ప్రధాన కారణం.ఆహ్వానాల్ని అందుకున్న మాజీ ప్రధాని మన్మో హన్ సింగ్, ఉభయ సభల్లో విపక్ష నేతలు అధిర్ రంజన్ చౌదరి,గులాం నబీ ఆజాద్ కూడా విందుకు వెళ్లడం లేదు.అనారో గ్యం వల్ల హాజరు కాలేక పోతున్నానని మన్మోహన్ నిర్వాహకులకు తెలిపారు.