పిలవని పేరంటమా…డీఎంకే కౌన్సిలర్ల ఆగ్రహం

పిలవని పేరంటమా…డీఎంకే కౌన్సిలర్ల ఆగ్రహం

హొసూరు : ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో డీఎంకే తరఫున గెలుపొందడం తాము చేసిన పాపమా అని ఆ పార్టీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత హొసూరు యూనియన్ తొలి కౌన్సిల్ సమావేశం బుధవారం జరిగింది. దీనికి ఏడీఎంకే కౌన్సిలర్లకు మాత్రమే ఆహ్వానం అందింది. తమకు ఆహ్వానమే అందలేదని, సమావేశం గురించి తమకు తెలియదని డీఎంకే కౌన్సిలర్లు మండిపడ్డారు. ప్రజా మద్దతుతో గెలిచిన తమను తొలి సమావేశానికి ఆహ్వానించకపోవడం దారుణమని విరుచుకుపడ్డారు. ఇకనైనా కౌన్సిల్ సమావేశాల గురించి డీఎంకే కౌన్సిలర్లకు సకాలంలో సమాచారం అందించాలని అన్నారు. యూనియన్ చైర్మన్ దీనిపై స్పందించాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యల గురించి ప్రస్తావించడం, వాటికి పరిష్కార మార్గాలు సూచించడం ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా తమ కర్తవ్యమని వారు పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos