
కడప:త్వరలోనే వై కాపాలో చేర నున్నట్లు కడప జిల్లా సీనియర్ నేత డీ.ఎల్. రవీంద్రారెడ్డి ప్రకటించారు.బుధవారం కడప జిల్లా ఖాజీ పేటలో ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. చాలా కాలంగా తాను వై.ఎస్. కుటుంబంలో సభ్యుడిగా ఉన్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. తెదేపా ప్రభుత్వ హయాంలో అవినీతి విచ్చల విడిగా జరుగు తోందని ఆరో పించారు. జగన్ నాయకత్వంలో రాజకీయాల్లో కొత్త ఒర వడిని సృష్టిస్తామని భరోసా ఇచ్చారు. జగన్ కు అన్ని రకాలుగా అండగా ఉంటామని ఆయన సమక్షంలో త్వరలోనే తాను వైకాపాలో చేరతానని తెలిపారు. డీఎల్ రవీంద్రా రెడ్డికి ఏ పదవి అప్పగి స్తారన్న విషయం తెలియ రాలేదు. బుధ వారం ఉదయం కాజీపేటలో డీ.ఎల్. రవీంద్రారెడ్డిని కడప లోక్‌సభ వైకాపా అభ్యర్థి వైఎస్.అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డికలుసుకుని మంతనాలు జరిపారు. ఆ తర్వాత రవీంద్ర రెడ్డి మాధ్యమ ప్రతినిధులతో మాట్లా డారు.