సోన్‌భద్ర:ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 3,000 టన్నులకు పైగా బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎ స్ఐ), రాష్ట్ర భూగర్భ విజ్ఞాన, గనుల శాఖ అధికారులు నిర్ధారించారు. సోన్‌పహాడీలో 2700 టన్నులు, హార్దీలో 650 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు అంచనా. బంగారంతో పాటు యురేనియం నిల్వలు కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా.