బెంగళూరు: ‘నేను ఏ తప్పూ చేయ లేదు. అత్యాచారానికి పాల్పడ లేదు. లంఛాలు తీసుకోలేదు. ఎలాంటి నేరాలకు పాల్పడ లేదు. నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆరోపణలు లేవు. శుక్ర వారం మధ్యాహ్నం ఇ.డి.అధికారుల ఎదుట హాజరవుతాను. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంద’ని కర్నాటక మాజీ మంత్రి శివ కుమార్ అన్నారు. శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఢిల్లీలోని ఈడీ అధికారుల శివకుమార్‌కు తాఖీదులు జారీ చేసారు. దీని గురించి కార్యకర్తలు ఆందోళనకు గురికావద్దొని శుక్రవారం హితవు పలికారు. ‘ఆందోళన చెందకండి. అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గురువారం రాత్రి ఈడీ తాఖీదులు అందాయి’ అన్నారు. దిల్లీలోని శివకుమార్ నివాసంలో రూ.8.59 కోట్ల నగదును ఏడాదిన్నర కిందట ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పన్ను ఎగవేత, హవాలా బదిలీల ఆరోపణల కింద గతేడాది సెప్టెంబరులో ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇటీవలవిచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. వీటిని శివకుమార్ క ర్నాటక న్నత న్యాయస్థానంలో సవాలు చేసారు. ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తోసి పుచ్చింది.