అనంతపురం: ‘ధన ప్రభావంతోనే వైకాపా పార్టీ పంచాయతి ఎన్నికల్లో విజయాలు సాధిస్తోంది. అభివృద్ధిని చూసి ప్రజలు అండగా ఉంటు న్నార’ని ఆ పార్టీ నేతలు చేసు కుంటున్న ప్రచారం అవాస్తవమని తెదేపా నేత దివాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఉదయం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘జగన్ ఒక రోజు ఆదాయం రూ. 300 కోట్లు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి కుప్పం నియోజక వర్గాన్ని చంద్రబాబు ఎంతో బాగా అభివృద్ధి చేశారు. అయినా, వైకాపా ఇచ్చినంత డబ్బును ఇవ్వలేక ఓడిపోయారు. అధికార పార్టీ ధన బలానికి పోలీసులు కూడా తోడయ్యారు. అందుకే ఎన్నికల్లో జగన్ బ్యాచ్ అధిక విజయాలు సాధించిందన్నారు. చంద్రబాబు ఎటువంటి వ్యక్తో, జగన్ ఎటువంటి వ్యక్తో ప్రజలకు తెలుస’న్నారు.