దిశ హత్యాచార కేసు నిందితుడు, పోలీసుల ఎన్ కౌంటర్లో మరణించిన చెన్నకేశవులు తండ్రి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని సైబరాబాద్ ఏసీపీ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి.చెన్నకేశవులు తండ్రి కూర్మయ్య అలియాస్ కూర్మప్ప తన స్వగ్రామమైన గుడిగుండ్ల నుంచి బండిపై వస్తుండగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ సమీపంలో ఏసీపీ వాహనం ఢీకొట్టింది.ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కూర్మయ్యను తొలుత మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, అతన్ని హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఈ ప్రమాదం తరువాత సదరు పోలీసు అధికారిపై నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేశారన్న సెక్షన్ పై కేసు నమోదు చేశామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.