అమరావతి : ‘గతంలో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉండేవి. వ్యవస్థలో మార్పుకోసమే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాం. . ఇటువంటి నిర్ణయాలతోనే మార్పు సాధ్యం. ప్రతి చోట దిశ ఘటనపైనే చర్చ జరుగుతోంది. ఘటన పునరా వృతం కాకూడదనుకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేన’ని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. దిశ ముసాయిదా గురించి జరిగిన చర్చలోఆయన పాల్గొన్నారు. ‘త్వరితగతిన న్యాయం చేకూర్చేందుకే దిశ చట్టం తెచ్చాం. ఈ చట్టం అమలులో భాగంగా ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు చేస్తాం. వాటిలో మహిళలు, పిల్లలపై జరిగే వేధింపులకు సంబంధించి కేసుల విచారణ మాత్రమే జరు గు తుంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాల ఏర్పాటవుతాయి. సామా జి క మాధ్యమాల్లో మహిళలను కించ పరిచేలా పోస్టులు పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయి. జిల్లా ప్రత్యేక కోర్టులో విచార ణ జరుగు తుంది. ఈ తరహా నేరాలకు రెండేళ్ల జైలు శిక్ష. రెండోసారి కూడా అదే నేరం చేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కచ్చిత మైన ఆధారాలుంటే మరణ శిక్ష వేసేలా చట్టంలో మార్పులు చేసాం. 14 రోజుల్లో విచారణ పూర్త య్యేలా చర్యల్ని తీసుకున్నాం. మహిళలు, చిన్నారులపై నేరా లకు పాల్పడిన వారి వివరాలను డిజిటలైజేషన్ చేస్తామ’ని విశదీకరిం చారు.