చాలా కాలంగా వరుస పరాజయాలు వెక్కిరిస్తుండడంతో ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ హిట్టు కొట్టి తీరాలని గట్టిగా నిర్ణయించుకున్న రవితేజ కొత్త చిత్రం డిస్కోరాజా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.డిస్కోరాజాలో కొత్తగా కనిపించేందుకు జిమ్ములో కష్టపడుతున్న ఫోటో ఒకటి కొద్ది రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.ఎక్కడికి పోతావు చిన్నవాడ,ఒక్క క్షణం వంటి విభిన్న చిత్రాలు తెరకెక్కించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిస్కోరాజాపై ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి అయితే ఉంది.తాజాగా ఈ ఆసక్తిని రెట్టింపు చేసే విధంగా డిస్కోరాజా కథ ఇదేనంటూ ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. డిస్కో డాన్స్ లతో యూత్ కు కిక్ ఎక్కిస్తూ డిస్కోకింగ్ గా పేరు తెచ్చుకుంటాడు రవితేజ . ఓ రోజు తన పోగ్రాం ముగించుకు వస్తూండగా…అనుకోకుండా ఓ అమ్మాయి కోసం ఓ రాజకీయ నాయకుడితో గొడవ పడాల్సి వస్తుంది. దీంతో వారిద్దరి మధ్య వైరం మొదలైంది. ఆ నెక్ట్స్ ఆ రాజకీయ నాయకుడు వేసిన స్కెచ్కి దీటుగా ఓ యాక్షన్ రిప్లై ఇచ్చే సమయంలో కోమాలోకి వెళ్తాడు రవితేజ.చాలా కాలం కోమాలో ఉండి బయిటకు వచ్చిన రవితేజ…ఆ రాజకీయ నాయకుడిపై రివేంజ్ తీర్చుకోవటానికి వచ్చేసరికి…బయిట ప్రపంచంలో పరిస్దితులు మారిపోతాయి. ఆ రాజకీయనాయకుడు ఇప్పుడు మినిస్టర్ స్దాయికి ఎదిగిపోతాడు. తనకా ఈ మధ్యకాలంలో వచ్చిన టెక్నాలజీ కానీ మరొకటి కానీ తెలియదు. అంతా మారిపోయింది. ఈ నేపధ్యంలో రవితేజ ఏం చేస్తాడు..ఎంత డిఫరెంట్ గా తన రివేంజ్ తీర్చుకుంటాడు అనేది ‘డిస్కోరాజా’ సినిమా కథ అని తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 2న ఫస్ట్లుక్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.డిశెంబర్ 20న చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.