గీతగోవిందం చిత్రం భారీ బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో దర్శకుడు పరశురామ్‌తో సినిమాలు తీయడానికి హీరోలతో పాటు నిర్మాతలు సైతం ఆసక్తి కనమరిచారు.14 రీల్స్,మైత్రి తదితర పెద్ద నిర్మాణ సంస్థలు పరశురామ్‌కు బయానాలు చెల్లించి సినిమా ఎప్పుడు తీస్తాడా అని ఎదురు చూడసాగారు.ఈ క్రమంలో స్టార్ హీరోతోనే సినిమా చేయాలని పట్టుబట్టి కూర్చున్న పరశురామ్ కు అలాంటి ప్రాజెక్టు ఏదీ సెట్ కాలేదు. ఈమధ్య 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో నాగచైతన్యతో సినిమా ఫిక్స్ అయింది.దీంతో సీనియర్ నిర్మాత భోగవల్లి ప్రసాద్ దర్శకుడు పరశురామ్‌పై ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశాడని సమాచారం.తన బ్యానర్‌లో సినిమా తీయడానికి పరశురామ్‌కు 2008లో రూ.25లక్షలు ఇచ్చానని అయితే అప్పటి నుంచి తనకు సినిమా తీసివ్వకుండా సాకులు చెబుతూ కాలయాపన చేసిన పరశురామ్ తాజాగా 14 రీల్స్ బ్యానర్‌లో సినిమాకు దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యాడని ఫిర్యాదు చేశాడట.దీంతోపాటు 2008లో తాను ఇచ్చిన అసలు రూ.25లక్షలతో పాటు వడ్డీ రూ.6 కోట్లు కలిపి చెల్లించాలంటూ ఫిర్యాదు చేశాడట.మరోవైపు ఇతర నిర్మాణ సంస్థలు సైతం పరశురామ్ తీరుతో విసిగిపోయి అడ్వాను్న్సులు తిరిగి ఇచ్చేయాలంటూ ఒత్తిడి చేశాయట.దీంతో ఇతర నిర్మాతల దగ్గర తీసుకున్న ఎడ్వాన్సులను వడ్డీతో సహా తిరిగి ఇచ్చే పనిలో పడ్డాడట.ఈ లిస్టులో మోహన్ బాబు.. బీవీఎస్ ఎన్ ప్రసాద్.. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఉన్నారట. అయితే పరశురామ్ ఇలా ఎడ్వాన్సుల తిరిగి ఇవ్వడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.