పూజాహెగ్డే నడుముపై రాఘవేంద్రరావు హాట్‌ కమెంట్స్..

  • In Film
  • September 18, 2019
  • 200 Views
పూజాహెగ్డే నడుముపై రాఘవేంద్రరావు హాట్‌ కమెంట్స్..

వరుణ్‌తేజ్‌ ప్రధాన పాత్రలో తమిళ హిట్‌ చిత్రం జిగర్‌తండా రీమేక్‌గా తెరకెక్కిస్తున్న వాల్మీకి చిత్రంలో వరుణ్‌,పూజాహెగ్డేపై చిత్రీకరించినఎల్లువచ్చి గోదారమ్మ‘ సాంగ్ ప్రోమోని లాంచ్ చేశారు. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఎల్లువచ్చి గోదారమ్మసాంగ్ ని రీమిక్స్ చేసి తనను పాతికేళ్ల వెనక్కి తీసుకెళ్లారని అన్నారు. అప్పటిరోజులు గుర్తుకు వస్తున్నాయని..  పాటను అప్పట్లో చాలా కష్టపడి చేశామని అన్నారు. పూజా హెగ్డేని మొదటిసారి చూసినప్పుడే టాప్ హీరోయిన్ అవుతుందని చెప్పానన్నారు. ‘పూజా హెగ్డే బిందెను అయితే నడుముపై పెట్టుకుందో బిందెను నాకు గిఫ్ట్ గా పంపిస్తావా..? అంటూ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ను కోరాడు.ఇన్ని బిందెల మధ్య దాన్ని గుర్తు పెట్టుకోవడం కష్టం కాబట్టి వేదికపై ఉన్న బిందెల్లో ఒకదాన్ని అందుకున్న పూజ.. దానికి ముద్దుపెట్టి మరీ రాఘవేంద్రుడికి కానుకగా అందించింది.ఇక ఆయన్ని హరీష్ శంకర్.. పూజను చూస్తే మీకు పండుతో కొట్టాలనిపిస్తుందని  అడగగా.. దానికి వెంటనే చెర్రీ అని సమాధానం చెప్పి దర్శకేంద్రుడు తన ‘అభిరుచిని’చాటుకున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos