దినకరన్‌కు చుక్కెదురు

ఢిల్లీ : అమ్మ మక్కళ్‌ మున్నేట్ర కజగం (ఏఎంఏకే) నాయకుడు టీటీవీ
దినకరన్‌కు సుప్రీం కోర్టులో మంగళవారం చుక్కెదురైంది. తమ పార్టీ గుర్తుగా వంట కుక్కర్‌ను
కేటాయించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే ఆ పార్టీ తరఫున పోటీ
చేస్తున్న అభ్యర్థులందరికీ ఉమ్మడి చిహ్నాన్ని కేటాయించే అవకాశం ఉంటే పరిశీలించాలని
ధర్మాసనం ఎన్నికల సంఘానికి సూచింది. అలా కేటాయించినా, ఆ అభ్యర్థులను స్వతంత్రులుగానే
పరిగణించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తా,
జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఒక పార్టీకి గుర్తింపునివ్వాలా
వద్దా అనే అంశం ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos