
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో భోపాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి కమల్నాథ్ శనివారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులకు తెలిపారు. సుదీర్ఘ చర్చల అనంతరం భోపాల్ నుంచి పోటీ చేయడానికి దిగ్విజయ్ నిర్ణయించు కున్నారన్నారు.ఈ నిర్ణయాన్ని తామంతా హర్షించామని చెప్పారు. దిగ్విజయ్ సింగ్ స్పందన ఇంకా రావాల్సి ఉంది. ఇతర పార్టీలకు పెట్టని కోటయిన నియోజక వర్గాల నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ చేయాలని గతంలో కమల్నాథ్ సూచించారు. భోపాల్, ఇండోర్, విదిశ లోక్సభ స్థానాల్లో గత మూడు దశాబ్దాల్లో కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు లేవు. పరోక్షంగా దీనిపై స్పందించిన దిగ్విజయ్ రాహుల్ గాంధీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుంచి పోటీ చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. 1984 నుంచి భోపాల్లో కాంగ్రెస్ గెలవటం లేదు.