డిగ్గీని గుళ్లలోకి రానివ్వరాదు

డిగ్గీని గుళ్లలోకి రానివ్వరాదు

భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ని దేవాలయాల్లోకి ప్రవేశించకుండా నిషేధించాలని నగర గోడలపై పత్రాల్ని అతికించారు. కషాయ వస్త్రాలు ధరించిన వాళ్లు ఆలయాల్లో అత్యాచారాల వంటి నేరాలకు’ పాల్పడుతున్నారని దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ‘హిందూ వ్యతిరేకి దిగ్విజయ్ సింగ్ను ఆలయాల్లోకి రాకుండా నిషేధం విధించాలని హిందూ సమాజం పిలుపునిస్తోంది. హిందూ సమాజం ఆయనను నిషేధించింద’ని ఇక్కడి పరశురాం ఆలయం ముందు కుడ్య పత్రం వెలిసింది. ‘మీడియా వాళ్లు వచ్చినప్పుడే నాకు ఈ పోస్టర్ల గురించి తెలిసింది. ఆలయాల వద్ద అలాంటి పోస్టర్లు ప్రదర్శించకూడదు. రోడ్లు, జంక్షన్లు వంటి బహిరంగ ప్రదేశాలు చాలా ఉన్నాయి. అలాంటి చోట్ల పోస్టర్లు అంటించు కోవచ్చ’ని ఆలయ పూజారి పండిట్ మోహన్ దూబే ’ అని పేర్కొన్నారు. అయితే దిగ్విజయ్ సింగ్ అలా మాట్లాడడం సరికాదన్నారు.
‘ఇవాళ, కాషాయ వస్త్రాలు ధరించిన వారూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆలయాల్లో అత్యాచారాలు జరుగు తున్నాయి. ఇదేనా మన మతం? మన సనాతన ధర్మాన్ని అప్రదిష్టపాలు చేసిన వారిని భగవంతుడు కూడా క్షమించడ’ని ఇటీవల దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించటం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos