న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అసమ్మతి ఇప్పటికిప్పుడే పుట్టిందేమీ కాదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలుగా నియమితులైనప్పుడే ఈ అసంతృప్తి చోటు చేసుకుందని ఆయన వెల్లడించారు. అధ్యక్ష బాధ్యతల్లో లేకపోయినా రాహుల్ గాంధీ నిశ్శబ్ధంగా చక్రం తిప్పుతూనే ఉంటారు. పార్టీ నియామకాల్లో ఆయనే తుది నిర్ణయం. అధ్యక్ష బాధ్యతల్లో లేకపోయినా రాహుల్ అన్నీ తానై నడిపించడం సహించకనే సీనియర్లలో అసమ్మతికి కారణమ’ని విశ్లేషించారు.