భోపాల్: కాషాయ వస్త్రాలు ధరించి, పొడుల మ్ముకునేవారు ఆలయాల్లో అత్యాచారాలు చేస్తున్నారని మంగళవారం ఇక్కడ జరిగిన మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక శాఖ సంత్ సమాగమ్లో కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ని ఉద్దేశిస్తూ ‘పురాతన సనాతన ధర్మాన్ని విస్మరించే వారిని దేవుడు కూడా క్షమించాడు. ప్రస్తుత సమాజంలో కాషాయ వస్త్రాలు ధరించి పొడుల మ్ముకునే వారు కొందరు ఆలయాల్లో అత్యాచారాలు చేస్తున్నారు. అలానే కొందరు వ్యక్తులు జై శ్రీ రాం నినాదాన్ని హై జాక్ చేశారు. రాముడి పేరిట నినాదాలు చేసే వీరు సీతను ఎందుకు మర్చిపోతున్నారు’ అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా పాల్గొ న్నారు. ‘ఆలయాలకు ప్రభుత్వ భూముల్ని కేటాయించి, ఉచిత విద్యుత్ సరఫరా చేయాలి, సాధువులకూ వృద్ధాప్య ఫించన్లు ఇవ్వాలని కంప్యూటర్ బాబా ఈ సభలో డిమాండ్ చేశారు.