అది దాడి కాదు ప్రమాదం

అది దాడి కాదు ప్రమాదం

న్యూఢిల్లీ:‘పుల్వామా దుర్ఘటన వ్యూహాత్మకంగా జరిగిన దాడి కాదు. కేవలం ప్రమాదం మాత్రమే. ఏదేమైనా, పుల్వామా ‘దుర్ఘటన’ తర్వాత ఐఏఎఫ్ నిర్వహించిన వైమానిక దాడులపై కొన్ని విదేశీ మీడియా సంస్థలు ‘సందేహాలు’ వ్యక్తం చేస్తున్నాయి. ఇది మన భారత ప్రభుత్వ ‘విశ్వసనీయతపై’ ప్రశ్నలు లేవనెత్తుతోంది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మంగళవారం చేసిన ట్వీట్ రాద్ధాంతాన్ని సృష్టించింది. పాకిస్తాన్ బాలాకోట్లో జరిపిన వైమానిక దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు హతులయ్యారని ప్రశ్నించారు.‘250 మంది ఉగ్రవాదులను మట్టు బెట్టినట్లు భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా,400 మందిని హత మార్చినట్లు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్,ఒక్కరు కూడా చనిపోలేదని కేంద్రమంత్రి అహ్లూవాలియా అన్నారు. ప్రధాని మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు.ఎవరు అబద్ధం చెబుతున్నారో తెలుసుకోవాలని దేశం కోరుకుంటోంది’అని పేర్కొన్నారు.మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని డిమాండు చేసారు. వైమానిక దాడులు తమ ఘనతే అని చెప్పుకుంటూ ప్రధాని మోదీ, ఆయన మంత్రులు భద్రతా దళాలను అవమానిస్తున్నారని దిగ్విజయ్ ఆరోపించారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ భారత ఆర్మీ, భద్రతా దళాలపై గౌరవం ఉందని పునరుద్ఘాటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos