భారీ వ్యయంతో,భారీ
మల్టీస్టారర్‌తో గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంపై అంచనాలు ఎంతలా
పెరుగుతున్నాయో చిత్రంపై వస్తున్న ఊహాగానాలు కూడా అంతేస్థాయిలో ఉంటున్నాయి.ముఖ్యంగా
కథానాయికలపై వస్తున్న ఊహాగానాలకు హద్దే లేకుండా పోతోంది.బాలీవుడ్ నటీమణులు అలియాభట్,పరిణితీచోప్రాల
కోసం రాజమౌళి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు జాతీయ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి.ఇంత
జరుగుతున్నా ఇటు రాజమౌళి కానీ అటు అలియా,పరిణీతిలు కానీ ఏమాత్రం నోరు మెదపడం లేదు.ఈ
క్రమంలో కొత్త చిత్రం కేసరీ ప్రమోషన్‌లో పాల్గొన్న పరిణీతికి ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం వస్తున్న
ఊహాగానాలకు సంబంధించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో నటిస్తున్నారా అంటూ
మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అవునని కాదని చెప్పకుండా సమాధానం దాటవేసింది పరిణీతి.తాను
చేయబోతున్న చిత్రాల గురించి మరో వారంలో తెలియజేస్తానంటూ అక్కడి నుంచి జారుకుంది.ఒకవేళ
నటించకపోతే అటువంటిది లేదంటూ స్పష్టం చేయకుండా వారంలో తెలియజేస్తానంటే ఏమనుకోవాలి?ఆర్‌ఆర్‌ఆర్‌లో
ఉన్నట్లు అనుకోవాలా పరిణితి??