విజయవాడ: న్యూరాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసుల నమోదు కలకలం రేపుతున్నాయి. మొత్తం 102 మంది వ్యాధి బారిన పడగా, 48 మంది చికిత్స పొందుతున్నారు. 54 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. స్థానికంగా జరిగిన రెండు మరణాలు డయేరియా వల్లే సంభవించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తాగునీటి సరఫరాలో సమస్యలు లేవని చెబుతున్నా, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇంకా రంగు మారిన నీరే సరఫరా చేస్తున్నారు. నగరంలో డయేరియా తరచూ ప్రబలుతూనే ఉంటోంది. గతంలో మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి ఓ వ్యక్తి చనిపోగా, 10 మంది అస్వస్థతకు గురయ్యారు. డయేరియా కారణంగా ప్రాణ నష్టం జరగలేదని, వదంతులు నమ్మొద్దని మంత్రి నారాయణ చెబుతున్నారు. సహాయం కోసం 9154970454 నంబర్‌తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.