ధోనీకి పెరుగుతున్న మద్దతు

  • In Sports
  • June 7, 2019
  • 166 Views
ధోనీకి పెరుగుతున్న మద్దతు

ముంబై : టీమిండియా వికెట్ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ధరించే గ్లౌజుల విషయంలో బీసీసీఐ అతనికి మద్దతుగా నిలిచింది. బలిదాన్‌ గుర్తులున్న గ్లౌజులను ధోనీ ధరించకూడదని ఐసీసీ ఇదివరకే బీసీసీఐకి సూచించిన సంగతి తెలిసిందే. ఆ గ్లౌజులను ధరించడానికి గతంలో ఐసీసీ అనుమతి కోరామని బీసీసీఐ పాలకవర్గం చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ తెలిపారు. ఐసీసీతో దీనిపై మరింతగా చర్చించి మాట్లాడనున్నట్లు చెప్పారు. ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా దీనిపై స్పందిస్తూ, ఐసీసీ ఈ అంశంపై అభ్యంతరం తెలపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బలిదాన్‌ గుర్తులున్న గ్లౌజులను ధరించడానికి ధోనికి అనుమతివ్వాలని సూచించారు. ఇది కేవలం జాతి గౌరవం మాత్రమేనని, ఇందులో ఎలాంటి వాణిజ్య అంశాలు లేవని తెలిపారు. మరో వైపు గ్లౌజులపై ఆ గుర్తులను తొలగించాలని బీసీసీఐని కోరామని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ క్లైరే ఫర్లాంగ్‌ తెలిపారు. బీసీసీఐ అభిప్రాయాన్ని ఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళతామని, వారే తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos