రికార్డుకు చేరువలో ధోనీ

రికార్డుకు చేరువలో ధోనీ

వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఓ రికార్డుకు చాలా దగ్గరలో ఉన్నాడు. ఇప్పటి వరకు ధోనీ మూడు ఫార్మాట్లలో కలిపి 594 మ్యాచ్‌లు ఆడాడు. మరో మూడు మ్యాచ్‌లు ఆడితే, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన కీపర్‌ అనే కీర్తి ధోనీ సొంతమవుతుంది. ఇప్పటి వరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ కీపర్‌ మార్క్‌ బౌచర్‌ పేరిట ఉంది. అతను 596 మ్యాచ్‌లు ఆడాడు. 499 మ్యాచ్‌లతో శ్రీలంక వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కర  మూడో స్థానంలో, 485 మ్యాచ్‌లతో ఆసీస్‌ మాజీ కీపర్ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ నెల 24 నుంచి ఆస్ట్రేలియా ఇండియాలో పర్యటించనున్న సందర్భంగా రెండు టీ20, అయిదు వన్డేలు ఆడనుంది. కనుక ధోనీ రికార్డు సృష్టించడానికి సమయం ఆసన్నమైనట్లే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos