రూ.35 కోట్ల నగదు తరలించిన డిజిపి

న్యూఢిల్లీ:ఎన్నికల్లో పాలక పక్షం అభ్యర్థుల గెలుపుకోసం ధనాన్ని అక్రమంగా తరలించిన ఆంధ్రప్రదేశ్‌ పోలీసు డైరెక్టర్‌ జనరల్ ఆర్‌.పి.ఠాకూర్‌ను తొలగించాలని గురువారం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైకాపా నేతలు గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. తర్వాత విజయసాయిరెడ్డి,వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు.‘ఈ నెల 24న పోలీసు డైరెక్టర్‌ జనరల్ ఆర్‌.పి. ఠాకూర్ తన కారులోనే అమరావతి నుంచి రూ.35 కోట్ల నగదును ప్రకాశం జిల్లాకు తరలించారని ఆరోపించారు. ఆయన్ను బదిలీ చేస్తే తప్పా ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగబోవన్నారు. ‘ఠాకూరుకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు సిద్దంగా ఉన్నాం. . ఆరోపణలు తప్పైతే కేసు పెట్టాల’ని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని దుయ్య బట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల్ని ఖాతరు చేయకుండా నిఘా విభాగాధిపతి వెంకటేశ్వర రావును బదిలీని రద్దు చేసారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పలు పోలీసు అధికారులను బదిలీ చేయాలని తాము గతం చేసిన ఫిర్యాదుల్ని ఎన్నికల సంఘం పట్టించుకోలేదనా తప్పుబట్టారు. పోలీసు ఉన్నతాధికారులు దామోదర్ నాయుడు, ఘట్టమనేని శ్రీనివాస్, యోగానంద్, ప్రవీణ్‌, చిత్తూరు జిల్లా ఎస్పీ, గుంటూరు రూరల్ ఎస్పీని బదిలీకి చేసిన వినతుల్ని బుట్టదాఖలు చేసారన్నారు. ప్రజా శాంతి పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తు తమ పార్టీకి చెందిన ఫ్యాన్ గుర్తును పోలి ఉందన్నారు. 35 అసెంబ్లీ , 4 ఎంపీ స్థానాల్లో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ చంద్రబాబు నాయుడుతో కుమ్మకై తమ పార్టీ అభ్యర్ధుల పేర్లను పోలిన వారిని బరిలోకి దింపారని ఆరోపించారు. ఈసీ ఆదేశాలను చంద్రబాబు నాయుడు ఖాతరు చేయడం లేదని వైసీపీ నేతలు ఆరోపించారు.ఆర్పీ ఠాకూర్ వాహానాన్ని తనిఖీ చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. తాము డీజీపీపై చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. తాము చేసిన ఆరోపణలు తప్పైతే కేసు పెట్టాలని విజయ సాయి రెడ్డి డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos