బన్నీ ట్వీట్‌కు డేవిడ్‌ మామ రీట్వీట్‌..

బన్నీ ట్వీట్‌కు డేవిడ్‌ మామ రీట్వీట్‌..

లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో అన్ని కార్యకలాపాలు స్తంభించాయి.ప్రజలతో పాటు సినీనటులు,క్రీడాకారులు సైతం ఇళ్లకే పరిమితయ్యారు.దీంతో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ట్విట్టర్‌లో బ్యాటింగ్‌ చేస్తున్నాడు.కొద్ది రోజులుగా తెలుగు చిత్రాల పాటలు,డైలాగులతో ట్విట్టర్‌లో హల్‌చల్‌ చేస్తున్నాడు. ల్లు అర్జున్ నటించిన తాజా సూపర్ హిట్ చిత్రంఅల వైకుంఠపురములోనిబుట్టబొమ్మా బుట్టబొమ్మాపాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేయగా, అది తెగ వైరల్ అయింది.అదే ఊపులోరాములో రాములా…’ పాటకు కూడా డ్యాన్స్ చేశాడు. వీడియోను చూసిన అల్లు అర్జున్, వార్నర్ డ్యాన్స్ ను మెచ్చుకుంటూ, “మరో అతిపెద్ద సర్ప్రైజ్. మరోసారి ధన్యవాదాలు సర్అని వ్యాఖ్యానించగా, వార్నర్ స్పందించాడు. “ఏదో నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాకు పాట, డ్యాన్స్ చాలా నచ్చాయిఅని ట్వీట్ చేశాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos