16 నుంచి దేశం ప్రచార పర్వం

16 నుంచి దేశం ప్రచార పర్వం

అమరావతి:  ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 16న తిరుపతిలో  ఆరంభించ నున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం  ఆయన ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల తెదేపా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ జరిపారు. 16న శ్రీకాకుళం, 17న విజయ నగరం, విశాఖ, గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.  రెండో దశలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో, తర్వాతి దశలో కర్నూలు, కడప, అనంతపురంలో ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తామని విపులీకరించారు. 15 నుంచి  సేవా మిత్రలు, బూత్ కన్వీనర్లతో జిల్లా సభలు నిర్వహించాలని, సంక్షేమ పథకాల లబ్దిదారు లంతా తెదేపాకే  మద్ధతు ప్రకటించేలా చర్యల్ని తీసుకోవాలని  సూచించారు.  ఫారం-7 దుర్వినియోగా నికి పాల్పడి , పట్టుబడిన  ఇప్పుడు తన ఓటునే తొలగించే ప్రయత్నం జరిగిందని జగన్ ఆరోపిస్తు న్నారని  దుయ్యబట్టారు. జగన్ ఎన్నికల వేషాల్ని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని విన్నవించారు. 18 నుంచి లబ్ధిదారులే  స్వచ్ఛందంగా పార్టీకి ప్రచారాన్ని చేసినా ఆశ్చర్య పోనవసరం లేదన్నారు. తెలంగాణ నుంచి అక్రమ మార్గంలో వచ్చే ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలని హెచ్చరించారు. హెలికాఫ్టర్ గుర్తును ఫ్యాన్ గుర్తేమో అని భయపడే పరిస్థితుల్లో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. మోదీ, జగన్, కేసీఆర్ అనుబంధం మరోమారు ఈడీ మాజీ డైరెక్టర్ సీబీఐకి రాసిన లేఖ ద్వారా బహిర్గత మైందన్నారు. రాష్ట్ర హక్కును తాకట్టు పెట్టే కుట్రను ఎండ గట్టి తీరాలని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితు ల్లోనూ ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు. ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం ప్రకారం అభ్యర్థుల్ని మార్చడానికి వెనుకాడబోనని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos