కర్నూలు: వచ్చే ఎన్నికల్లో తెదేపాతో పొత్తు పెట్టుకొనే ప్రసక్తే లేదని భాజపా రాష్ట్ర బాధ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ థియోధర్ పేర్కొ న్నారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ కార్యాధ్యక్షుడు జేపీ నడ్డా తనకు ఈ విషయాన్ని చెప్పారన్నారు. తెలుగు దేశం పార్టీ ఏర్పాటు లక్ష్యానికి చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారని విమర్శించారు. తెదేపా స్థాపకుడు దివంగత ఎన్టీఆర్ బాహుబలి అయితే చంద్రబాబు నాయుడు ఆయన వెన్ను పొడిచిన కట్టప్ప అని అభివర్ణించారు. జనసేన, వైకాపాతో కూడా పొత్తుకు చెల్లని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడి గెలుస్తుందని దీమా వ్యక్తీకరించారు. వచ్చే ఎన్నికల్లో భాజపాతో తెదేపా జత కట్టే అవకాశాల్ని తోసి పుచ్చజాలమని లోక్సభ మాజీ సభ్యుడు దివాకర్ రెడ్డి ఒక మాధ్యమ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనటం గమనార్హం.