నిత్య కళ్యాణం డెంగి దోమ

అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ దోమలాంటి వ్యక్తి అని వైకాపా నేత విజయ సాయి రెడ్డి శుక్రవారం ట్వీట్లో ఎద్దేవా చేసారు. ‘నిత్య కళ్యాణం గురించి సామాజిక మాధ్యమాల్లో ఏమనుకుంటు న్నారంటే సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడట. వర్షాకాలంలో ఎగిరెగిరి, శీతాకాలంలో చల్లబడి, వేసవిలో కనిపించకుండా పోతాడట. ఇన్నాళ్లు నడిచిందేమో కాని ఇకపై దోమలకు కష్టకాలమే’అన్నారు. ‘ఇసుక కొరత తీర్చాలంటూ చేసిన దీక్షలో మెడకు ఇసుక పొట్లాల దండ వేసుకున్నాడు. ఎప్పుడైనా కరువు పైన దీక్ష చేయాల్సి వస్తే ఎముకల హారం చుట్టుకునేలా ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తు న్నాడో తెలియట్లేదు. ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలు కట్టినంత మంది కూడా దొంగ దీక్షకు హాజరు కాలేదని’ చంద్రబాబు నాయు డును మరో ట్వీట్లో ఈసడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos