కాబూల్ : ఇక్కడి నుంచి ఆదివారం జర్మనీకి బయల్దేరిన అమెరికన్ మిలిటరీ సరకు రవాణా విమానంలో ఆఫ్ఘన్ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో గాలి పీడనాన్ని పెంచేందుకు విమానాన్ని తక్కువ ఎత్తులో పయనించేలా చేశారు. చివరికి వైద్య సిబ్బంది సహకారంతో ప్రసవం సాఫీగా జరిగిపోయింది. విమానాన్ని జర్మనీలోని రామ్స్టీన్ బేస్‌లో దింపి వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్లు అమెరికన్ సైనిక కమాండర్ ట్వీట్ చేశారు.