హైదరాబాద్: ఈ నెల 22న చెన్నైలో జరిగే డీలిమిటేషన్ సదస్సుకు కాంగ్రెస్ తరపున టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరవుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. డీఎంకే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ పాల్గొనబోతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.