ఢిల్లీ : గ్రేడింగ్ విధానంలో ఏర్పడిన ప్రతిష్టంభన వల్ల ఢిల్లీ విశ్వ విద్యాలయంలో ప్రవేశాలకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దీనిపై విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో వర్శిటీ అడ్మిషన్లను నిలిపివేసింది. నిబంధనల ప్రకారం ఆంధ్రా ఇంటర్ బోర్డు ఇచ్చిన సీజీపీఏ గ్రేడ్‌ను పదితో గుణించి శాతాన్ని లెక్కించాల్సి ఉండగా, ఢిల్లీ వర్శిటీ 9.5తో గుణిస్తామని చెబుతోంది. దీనివల్ల తమకు నష్టం జరుగుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సత్వరమే జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.