న్యూ ఢిల్లీ: నగరంలోని తొమ్మిది క్రీడాంగణాల్నితాత్కాలిక చెరసాలలుగా పరివర్తన చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం పోలీసులకు అనుమతి నిరాకరించింది. ఢిల్లీ చలో ఆందోళనలో భాగంగా నగరంలోకి వచ్చిన పంజాబ్, హర్యానా రైతుల స్టేడియాల్లో నిర్బంధించాలని పోలీసులు భావించారు. ‘రైతుల డిమాండ్ న్యాయమైనదే. వారిని చెరసాలల్లో బంధించటం సమస్యకు పరిష్కారం కాదు. వారి డిమాండ్లు అంగీకారయోగ్యమైనవి. ‘వారి ఆందోళన శాంతియుతంగా సాగుతోంది. శాంతియుతంగా ఆందోళన నిర్వహించడం ప్రతీ భారతీయుడి హక్కు. కాబట్టి ఢిల్లీ పోలీసుల అభ్యర్థనను ప్రభుత్వం తోసిపుచ్చింది’’ అని ఢిల్లీ హోం మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు.