న్యూ ఢిల్లీ: నగరంలో రేషన్ కార్డున్న 72 లక్షల మందికి రెండు నెలల పాటు ఉచితంగా తిండి గింజల్ని అందించనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళ వారం ప్రకటించారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు నెలకు రూ. 5000 ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో మరో రెండు నెలల పాటు లాక్డౌన్ కొనసాగు తుందని ప్రజలు భయపడొద్దని ధైర్యం చెప్పారు. పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశించారు. నిరుడు లాక్డౌన్ సమయంలోనూ 1.56 లక్షల డ్రైవర్లకు నెలకు రూ. 5000 ఆర్థిక సాయం చేసినట్లు వివరించారు.