న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలు, నోయిడా, గురుగ్రామ్‌లలో గురువారం రాత్రి 11 గంటల 46నిమిషాలకు భూమి కంపించింది. తీవ్రత 4.2గా దాఖలైందని శాస్త్రవేత్తలు తెలిపారు దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గురుగ్రామ్ కు నైరుతి దిశలో 48 కి.మీ దూరంలో, 7.5 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అర్థ రాత్రి 11 గంటల 46నిమిషాలకు భూమి కంపించిందని తెలిపారు. ఆ స్తి, ప్రాణ నష్టం జరిగిన సమాచారం లేదు.