హైదరాబాదు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఓడినా సంబంధిత మంత్రుల పదవులు ఊడి పోతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు.శనివారం ఇక్కడ జరిగిన తెరాస పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. తెరాసాతో భాజపాకు పోటీ అనే అపోహలు వద్దన్నారు. తమకు ఎవరితోనూ పోటీ లేదని చెప్పారు. నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలని సూచించారు. పాత, కొత్త నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని హితవు పలికారు. పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరారు. అవసరమైన చోట మంత్రులూ ప్రచారాన్ని చేస్తారని చెప్పారు.