కోల్కతా: భాజపా రాజకీయ దురహంకారాన్ని బంగ ప్రజలు తిరస్కరించారని రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘మితిమీరిన అహం, గర్వం మంచిది కాదు. భాజపాకు కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. అందుకే ఆ పార్టీనిప్రజలు తిరస్కరించారు. భాజపా అహంకారానికి తగిన మూల్య మిది’ అని వ్యాఖ్యానించారు.బంగలో మూడు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు ఒకచోట గెలుపొందారు. . మరో రెండు చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతూ భాజపాను దెబ్బ తీసారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఖరగ్పూర్ సర్దార్ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ గెలుపొందింది.కలియాగంజ్లో స్పష్టమైన ఆధిక్యత దిశగా దూసుకు పోతోంది. నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందిస్తూ.. ‘మితిమీరిన అహం, గర్వం మంచిది కాదు. భాజపాకు కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. అందుకే ఆ పార్టీనిప్రజలు తిరస్కరించారు. భాజపా అహంకారానికి తగిన మూల్యమిది’ అని వ్యాఖ్యానించారు.