అమెజాన్‌ అడవులకు రూ.36 కోట్ల విరాళం

అమెజాన్‌ అడవులకు రూ.36 కోట్ల విరాళం

లాస్ ఏంజెల్స్: అమెజాన్ అడవుల పరిరక్షణ కోసం ప్రముఖ హాలీవుడ్ హీరో, పర్యావరణ వేత్త లియోనార్డో డికాప్రియో 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.36 కోట్లు) విరాళాన్ని ప్రకటించారు. తను స్థాపించిన ఎర్త్ అలయన్స్ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ఈ విరాళాన్ని ఇవ్వనునన్నారు. అమెజాన్ అడవుల సంరక్షణ, అక్కడి ప్రజలు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. తమ వంతు సహాయం చేయా లని ఇతరకూ పిలుపు నిచ్చారు. మరిన్ని వివరాల కోసం alliance.org/amazonfund అంతర్జాల వేదికను చూడాలని కోరారు. ‘ప్రపంచం లోని ప్రాణులకు 20 శాతం ఆక్సిజన్ అందించే అటవీ ప్రాంతం ఇలా మంటల్లో చిక్కుకుపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భూమికి ఊపిరితిత్తులుగా ఉండే ఈ అమెజాన్ అడవులు గత 16 రోజులుగా మండిపోతున్నాయి. మాధ్యమాలు దీని మీద పెద్దగా దృష్టిసారించడం లేదు. ఎందుకు?’ అని ఆయన సామా జిక మాధ్యమాల్లో ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos