డెబోస్మిత చౌదరి విన్నూత్న నిరసన

డెబోస్మిత చౌదరి విన్నూత్న నిరసన

కోల్ కతా : నూతన పౌరసత్వ చట్టం, జాతీయ పౌర జాబితాకు వ్యతి రేకంగా జాదవ్ పూర్ విశ్వ విద్యాలయ స్నాతకోత్తర విద్యార్థిని డెబో స్మిత చౌదరి విన్నూత్న రీతిలో నిరసించారు. ఇక్కడి జాదవ్పూర్ విశ్వ విద్యాలయం లో జరిగిన స్నాత కోత్సవంలో ఉపకులపతి విద్యార్థులకు పట్టాలు, పతకాలు ప్రదానం చేశారు. డెబోస్మిత చౌదరి అనే విద్యార్థినిని వేదిక మీదకు పిలిచి ఎమ్ఏ పట్టాను ఆమెకు ప్రదానం చేశారు. అయితే ఒక్క నిమిషం ఆగాల్సిందిగా వేదిక మీద ఉన్న పెద్దలను కోరిన డెబోస్మిత తన చేతిలో ఉన్న సీఏఏ కాపీను ముక్కముక్కలుగా చింపివేశారు. ‘మేం కాగితాలు చూపించము. ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.అనంతరం డెబోస్మిత విలేఖరులతో మాట్లాడారు. ‘ఇందులో తికమకపడాల్సింది ఏమీ లేదు. జాదవ్పూర్ యూనివర్సిటీపై నాకు గౌరవం ఉంది. నా అభిమాన విద్యా సంస్థ నుంచి పట్టా అందుకోవడం గర్వంగా ఉంది. సీఏఏపై నాకు, నా స్నేహితులకు ఉన్న వ్యతిరేకతను చాటేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాన’న్నారు. డెబోస్మిత మాదిరే కొందరు విద్యార్థులూ నిరసించారు.‘ కాన్వొకేషన్ గౌన్లు వేసుకున్నాం. మా పేర్లు పిలిచినపుడు వేదికపైకి వెళ్లం. ఇలా మా నిరసనను తెలియ చేస్తున్నమ’ న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos