పులివెందుల..దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వై ఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం తెల్లవారు జామున గుండెపోటుతో మరణించారు. పులివెందులలోని తన ఇంటి బాత్ రూంలో ఆయన కుప్పకూలి పడి ఉండడాన్ని గమనించిన పని మనుషులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. వివేకాకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన వయస్సు 68 ఏళ్లు. పులివెందుల ఎమ్మెల్యేగా, కడప ఎంపీగా ఆయన పనిచేశారు.