మరో తెలుగు చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ రూపంలో తెరకెక్కడం ఖాయమైంది.విజయ్ దూవరకొండ,రష్మిక మందన్న జోడీగా నటించిన కొత్త చిత్రం డియర్ కామ్రేడ్ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత కరణ్‌జొహార్ ప్రకటించారు.అర్జున్‌రెడ్డి బాలీవుడ్ రీమేక్ కబీర్‌సింగ్‌లో నటించిన షాహిద్ కపూర్ డియర్ కామ్రేడ్ రీమేక్‌లో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ సినిమాను చూసి ట్విటర్ వేదికగా స్పందించారు.‘ఇది అద్భుతమైన, పవర్ఫుల్ ప్రేమకథ. భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ చక్కటి సంగీతం అందించారు. నటీనటుల నటన అత్యుత్తమంగా ఉంది. విజయ్ దేవరకొండ బ్రిలియంట్, రష్మిక బాగా నటించారు. ఈ అందమైన ప్రేమకథను ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ రీమేక్ చేయబోతోందని ప్రకటిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.హిందీ వెర్షన్ కు కొద్ది పాటి మార్పులు అవసరమవుతాయంటున్నారు.డియర్ కామ్రేడ్ చిత్రం తెలుగు,తమిళం,మలయాళం,కన్నడ భాషల్లో ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది..