అమరావతి : అనకాపల్లి పారిశ్రామకవాడలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు ఒకరు మృతి చెందారు. జిల్లాలోని రాంబిల్లి మండలం అచ్యుతాపురం వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. అక్కడే పనిచేస్తున్న ఒడిస్సా కు చెందిన కార్మికుడు ప్రదీప్రౌత్ తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. మరికొందరు కార్మికులు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ప్రమాదానికి కారణాలను కలెక్టర్కు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు.