డీసీఎంను ఢీకొట్టిన కారు – ముగ్గురు మృతి

డీసీఎంను ఢీకొట్టిన కారు – ముగ్గురు మృతి

హయత్‌నగర్‌ : రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టడంతో  ముగ్గురు మృతి చెందిన ఘటన బుధవారం హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌ పరిధిలో జరిగింది. కుంట్లూరులో రోడ్డుపై ఆగిఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos