బాలీవుడ్ యువహీరో సుశాంత్ ఆత్మహత్య వెనుక మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి.మాజీ రా ఆఫీసర్ NK సూద్ ఇటీవల సుశాంత్ సింగ్ మృతిపై స్పందించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. దీని వెనుక వరల్డ్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పరాజయాల కారణంగా కృంగిపోతున్న సమయంలో ఉహీంచని విధంగా దావూద్ నుంచి అతనికి బెదిరింపులు వచ్చాయని అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.అయితే సుశాంత్ కి దావూద్ ఇబ్రహీమ్ ఎందుకు బెదిరించడానే విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ ఘటన విషయంలో అతని హస్తం బలంగా ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రపంచానికి కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్న దావూద్ ఇబ్రహీమ్ సడన్ గా బాలీవుడ్ వైపు ఎందుకు మళ్ళీ ఉంటారనే కొత్త అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి.