కర్ణాటక రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తర కర్ణాటకతో పాటు దక్షిణకన్నడ,ఉడుపి,మడికేరి,కొడగు తదితర జిల్లాలు సైతం వరదబారిన పడ్డాయి.ఫలితంగా నగరాలు,పట్టణాలు,వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఠాకూర్ కుమార్తె సైతం వరదల్లో చిక్కుకుంది.ఉడుపిలో మణిపాల్ యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ చదువుతున్న అవంతిక స్నేహితులతో కలిసి వరదలు ముంచెత్తుతున్న బాగల్కోటె జిల్లాలోని బాదామికి బయలుదేరారు.ఈ క్రమంలో బస్సు మలప్రభ నది వరదలో చిక్కుకోవడంతో అవంతిక, ఆమె స్నేహితులు బస్సు దిగి వరద నీటిలోనే ముందుకు వెళ్లారు. హోసూరు గ్రామస్థులు వారికి ఆశ్రయం కల్పించారు. కాగా… వారిని సురక్షితంగా వారి ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు..