కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో డేట్‌కు వెళ్లాలని ఉందని, ఈ మాట చెబితే ఏం వివాదమవుతుందో తనకు తెలియదని బాలీవుడ్ నటి కరీనా కపూర్ తెలిపింది. సైఫ్ అలీఖాన్ రెండో భార్య అయిన కరీనాకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ఇంకా సినిమాల్లో నటిస్తూ, బిజీగా ఉన్న కరీనా సిమీగరేవాల్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మీరు ఎవరితో డేట్‌కు వెళ్లాలనుకుంటున్నారు…అని సిమీ అడిగినప్పుడు, రాహుల్ గాంధీ అని ఠక్కున చెప్పింది. అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. పత్రికల్లో అతని ఫొటోలను చూసినప్పుడు, అతనితో మాట్లాడాలనిపిస్తుందని తెలిపింది. తాను సినీ రంగానికి చెందిన కుటుంబం నుంచి వచ్చానని, అతనేమో రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి అని పేర్కొంది. తమ మధ్య జరిగే చర్చ ఆసక్తికరంగానే ఉండొచ్చని ఆమె తెలిపింది.