తెలుగుదేశానికి
చెందిన మరో కీలకనేత వైసీపీలోకి చేరడదం దాదాపు ఖరారైంది.ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత
సన్నిహితుడు,తెదేపా నేత జై రమేశ్ శుక్రవారం సాయంత్రం వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.సాయంత్రం
నాలుగు గంటలకు లోటస్‌పాండ్‌లో వైసీపీ అధినేత జగన్‌ను కలుసుకొని వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు
సమాచారం.జైరమేశ్ వైసీపీలో చేరనుండడంతో విజయవాడలో కూడా రాజకీయ వేడి మొదలైంది.విజయవాడ
నుంచి ఎంపీ టికెట్ ఆశించగా అందుకు జగన్ అంగీకరించకపోవడంతో కృష్ణ సోదరుడు ఘట్టమనేని
ఆదిశేషగిరిరావు కొద్ది రోజుల క్రితం తెదేపాలో చేరారు.దీంతో విజయవాడలో స్థానికంగా ప్రభావం
చూపగలిగే ఓ బలమైన నేతను ఎన్నికల బరిలో నిలపడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు.దీంతో కొద్ది
కాలంగా తెదేపాతో అంటీఅంటనట్టుగా ఉంటున్న దాసరి జైరమేశ్ అందుకు తగిన వ్యక్తిగా భావించి
విజయవాడ ఎంపీ టికెట్‌ను జైరమేశ్‌కు ఇవ్వడానికి జనగ్ మొగ్గు చూపినట్లు సమాచారం.వైసీపీలో
విజయవాడ ఎంపీ సీటుతో పాటు తగిన ప్రాధాన్యత కూడా దక్కుతుందంటూ జైరమేశ్‌కు అత్యంత సన్నిహితుడైన
దగ్గుబాటి వెంకటేశ్వరరావు సూచించడంతో వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
దాసరి జై రమేష్ టిడిపి నుండి 1998 లో విజయవాడ లోక్‌సభ అభ్యర్దిగా
పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ది పర్వతనేని ఉపేంద్ర..జై రమేష్ పై
30067 ఓట్ల ఆధిక్యత తో గెలుపొందారు. ఆ తరువాత ఆయన కొంత కాలం టిడిపి లో కొనసాగినా..తాజాగా
టిడిపికి దూరంగా ఉన్నారు. విజయవాడ లో టిడిపి నుండి గత ఎన్నికల్లో గెలిచిన కేశినేని
నాని తిరిగి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో గత ఎన్నికల్లో వైసిపి
నుండి విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ రాజకీయాలకు దూరంగా
ఉంటున్నారు. దీంతో..అదే సామాజిక వర్గం..ఆర్దికంగా బల మైన స్థానిక నేత అయిన జై రాం
రమేష్ వైపు జగన్ మొగ్గు చూపారు. ఇప్పటికే పార్టీ కీలక నేతలతో జై రాం రమేష్
మంతనాలు పూర్తయ్యాయి. ఇక, జగన్ ను కలిసిన తరువాత జై రాం రమేష్ ను విజయవాడ
నుండి లోక్‌సభ అభ్యర్దిగా వైసిపి అధినేత ప్రకటించనున్నారు.